17-07-2025 12:17:17 AM
మహబూబ్ నగర్ నగర్ జూలై 16 (విజయ క్రాంతి) : విద్యుత్ కార్మికులకు ఏ సమస్య వచ్ఛిన ముందుండి పోరాడే య ఓకే ఒక్క యూనియన్ 1104 అని మనం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రమశక్తి అవార్డు గ్రహీత సాయిబాబు అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్న ఏనుగోండ ఓం కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సన్మాన మహాత్సవ కార్యక్రమంలో 1104 యూనియన్ సర్కిల్ అధ్యక్షుడు స్వామి, సెక్రటరీ పాండు నాయక్ ల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ విద్యుత్ సంస్థ ను ప్రయివేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎవ్వరికీ రాకూడదంటే కార్మికులు ఐక్యమత్యంతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ సర్కిల్, డివిజన్ అద్యక్ష కార్యదర్శులు ఈఆర్‌ఓ, ఓ అండ్ ఎమ్ సిబ్బంది , ఆర్డీజన్ కార్మికులుపాల్గొన్నారు.