17-07-2025 12:17:57 AM
సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుజాత
ఎల్బీనగర్, జులై 16 : వానాకాలంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పని చేయాలని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుజాత ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను ఇటీవల జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాకు బదిలీ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో వానాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, బోనాలు పండుగ ఏర్పాట్లపై అధికారులతో మంగళవారం సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, టీఎస్‌ఎస్పీడీసీఎల్, వాటర్ వరక్స్, పోలీస్, హెల్త్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
సమావేశంలో వర్షాకాలంలో నాలా పూడిక తీయడం, భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, వర్షపు నీరు ప్రవహించడానికి అడ్డంకులు తొలగించడం, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను వెంటవెంటనే క్లియర్ చేయడం, పడిపోయిన చెట్లను వెంటనే తొలగించడం తదితర పనులను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, రాధాధీరజ్ రెడ్డి, పవన్ కుమార్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, అధికారులు కె.శ్రీనివాస్ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మెయింటెనెన్స్),
విజయ్ కుమార్, నవీన్ కుమార్ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మెయింటెనెన్స్), కవిత (ఎలక్ట్రికల్), చందనా చౌహన్, (శానిటేషన్), సీఐలు సైదిరెడ్డి, వెంకటేశ్వర్ రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, హైడ్రా, అగ్నిమాపక శాఖ, టీఎస్‌ఎస్పీడీసీఎల్, వాటర్ వరక్స్, పోలీస్, హెల్త్ అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.