calender_icon.png 17 July, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీరప్ప ఆలయ నిర్మాణానికి సహకారం

17-07-2025 12:16:28 AM

తుర్కయంజాల్, జులై 16:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూరులో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప ఆలయాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిశీలించారు. ఆలయంలో జరుగుతున్న పనులను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకురావాలని సూచించారు. ఆలయ పనులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.

ఆలయానికి చెందిన భూమిని పరిరక్షిస్తామని మల్రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. అలాగే కురు మల సామూహిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కురుమ సంఘం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, నక్క శివలింగంగౌడ్,

దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు మేకం జంగ య్య, శాగ రమేష్, జనరల్ సెక్రటరీ మేకం లింగం, కోశాధికారి కొశికె యాదగిరి, కమిటీ సభ్యులు శాగ ఎల్లయ్య, మేకం కొమురయ్య, మేకం భిక్షపతి, కొశికె లింగం, మేకం శ్రీశైలం, చినిగి రాజు, రాజ్కిరణ్, మేకం భాష, పెద్ద కురుమ శాగ లక్ష్మయ్య, శిలువోజి చినిగి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.