18 July, 2026 | 12:57 AM

ఆటో వాలాగా కేంద్రమంత్రి బండి సంజయ్

18-07-2026 12:57 AM

భరత్‌కు కొత్త ఆటో కొనిచ్చి నడిపిన కేంద్రమంత్రి 

కరీంనగర్, జూలై 17 (విజయక్రాంతి): హిందుత్వ నినాదాలున్న ఆటోను స్వయంగా నడుపుకుంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లో శుక్రవారం కలియదిరిగారు. నగరంలోని జ్యోతినగర్ నుంచి మంకమ్మతోట, గీతాభవన్, బస్టాండ్, బోయవాడ మీదుగా లక్ష్మీనగర్ దాకా ఆటో నడిపారు.

కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్యాసింజర్ సీట్లో కూర్చోగా, హిందుత్వ నినాదాలను ప్రచారం చేస్తున్న ఆటో డ్రైవర్ భరత్‌ను పక్కనే కూర్చోపెట్టుకుని ఆటో నడిపారు. లక్ష్మీనగర్‌లో భరత్‌కు పాత ఆటో స్థానంలో కొత్త ఆటోను అందించారు. భరత్‌కు పూర్తిగా అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు.