13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

ఆనందం పట్టలేకపోతున్నా

13-02-2026 07:27 PM

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay ) ప్రెస్ మీట్ నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుందని తెలిపారు. ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన ఓటర్లకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆనందం పట్టలేకపోతున్నా అన్నారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిపైనే ప్రయత్నించాం, గెలిచామన్నారు. మోదీ ఇచ్చిన నిధులు, తాను చేసిన అభివృద్ధికి ఈ గెలుపు నిదర్శనం అన్నారు. ఐదేళ్లలో కరీంనగర్ ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

ఎమ్మెల్యేగా ఓడినా తనను పార్టీ ఎంపీగా నిలబెట్టిందని గుర్తుచేశారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నానని చెప్పారు. ఓ సామాన్యుడికి ఇంత చేసిన పార్టీని ప్రజలు ఆదరించారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కొమ్మకై డబ్బు విచ్చలవిడిగా పంచాయని ఆరోపించారు. కరీంనగర్ కి సీఎం వచ్చారు, ఎంఐఎం బాస్ వచ్చారని తెలిపారు. మహామహుల్ని పిలిచారు, అయినా కరీంనగర్ ని ఏం చేయలేకపోయారని వెల్లడించారు. 66 డివిజన్లలో 31 గెలిచాం, కాషాయం కట్టిన ముగ్గురు ఇండిపెండెంట్స్ ఉన్నారని చెప్పారు. అభివృద్ధి కోరుతూ ముగ్గురు ఇండిపెండెంట్లు టచ్ లో ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ నుంచి గెలిచిన వాళ్లలో ఒక ముస్లిం కూడా ఉన్నారని పేర్కొన్నారు.