21-08-2025 10:45:06 AM
న్యూఢిల్లీ: సోహ్రాబుద్దీన్ కేసులో 2014లో అమిత్ షా ప్రమేయం లేదని కోర్టు తీర్పు ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరోపణలతో జైలుకు వెళ్తే స్వచ్ఛందంగా పదవీ నుంచి వైదొలగాలి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆడ్వాణీ.. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేశారని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ రాజీనామా చేయలేదని, రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నైతిక విలువలు పెరగడం కోసం లోక్ సభలో బిల్లు పెట్టామని తెలిపారు. ప్రభుత్వాలను కాపాడే రాజకీయ నేతలు, పార్టీలకు నైతిక విలువలు అవసరం అన్నారు.
దోచుకున్న వారికి లోక్ సభలో(Lok Sabha) పెట్టిన బిల్లు వల్ల కొంత బాధకలిగిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. కొంతమంది నేతలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ కలుగుతుందో అర్థం అవట్లేదన్నారు. భవిష్యత్తులో జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ హోరంగా ఓటమి చెందుతుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేరాభియోగాల నేతల తొలగింపు బిల్లును దేశమంతా స్వాగతిస్తోందన్న కిషన్ రెడ్డి(Kishan Reddy) ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకొచ్చామన్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ అన్న ఆయన కాంగ్రెస్ కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం అన్నారు. లోక్‌సభలో ఇండియా కూటమి నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.