21-08-2025 01:59:32 PM
న్యూఢిల్లీ: అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ అద్భుతంగా అనిపించిందని భారత వ్యోమగామి కెప్టెన్ శుభాంశు శుక్లా(Indian astronaut Captain Shubhanshu Shukla) అన్నారు. గురువారం నాడు శుక్లా మీడియా మాట్లాడారు. ఈ మిషన్ కోసం చాలా కష్టపడి పనిచేశామని చెప్పారు. ఈ మిషన్ కోసం మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఐఎస్ఎస్ నుంచి కొన్ని ఫోటోలు తీసుకొచ్చామని వెల్లడించారు. అంతరిక్షయానం కోసం చాలా శిక్షణ తీసుకున్నానని, ఏడాదిగా ఈ మిషన్ కోసం ఎంతో సమాచారం సేకరించానని చెప్పారు. తాను సేకరించిన సమాచారం గగన్ యాన్ మిషన్ కోసం పనికొస్తుందని శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ''భారతీయుడి కలను నెరవేర్చడం నాకు గర్వకారణం'' అన్నారు. అంతరిక్షయానం కోసం శరీరాన్ని సిద్ధం చేసుకోవడం మరచిపోలేని అనుభవమని, అంతరిక్షయానం ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిందని వ్యోమగామి కెప్టెన్ శుక్లా వివరించారు.