05-05-2025 09:06:25 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి భూ భారతి(Bhu Bharati) రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. 28 జిల్లాల్లోని 28 మండలాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ప్రారంభించనుంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని జిల్లాకో మండలం ఎంపిక కానుంది. జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి సదస్సులు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Revenue Minister Ponguleti Srinivas Reddy ) వెల్లడించారు. ఈ నెలలో 28 మండలాల్లో సదస్సులు నిరవహిస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూ భారతి చట్టంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూ సమస్య దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించడమే సదస్సుల లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. భూ భారతి పథకం రైతుల భూమిని కాపాడుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం అన్నారు.