16 April, 2026 | 11:21 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం

02-02-2026 12:47 AM

కోదాడ, ఫిబ్రవరి 1: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు ఏకమై ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జరిగిన సూర్యాపేట జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, 398 టీచర్ల అప్రెంటిస్ పీరియడ్ ఇంక్రిమెంట్లను పదవీ విరమణ సమయానికైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలూరి అంజయ్య, రాష్ట్ర ఉపా ధ్యక్షులు కె.వి. సత్యనారాయణ, మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని నాగభూషణం పాల్గొన్నారు.