calender_icon.png 13 February, 2026 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యతతోనే వడ్డెరుల జీవితాల్లో మార్పు: పీట్ల శ్రీధర్

13-02-2026 12:00:00 AM

ఎల్బీనగర్, ఫిబ్రవరి 12 : ఐకమత్యం, రాజకీయ చైతన్యంతోనే వడ్డెరుల జీవితాల్లో మార్పు సాధ్యమని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పీట్ల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మల్లె కృష్ణ పిలుపునిచ్చారు. గురువారం హయత్‌నగర్‌లోని ముదిరాజ్ కాలనీలో స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆలకుంట రాము ఆధ్వర్యంలో వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు వడ్డెర కులస్తుల సంక్షేమానికి ప్రత్యేక సం క్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణలో వడ్డెరులు సుమారు 30 లక్షలకుపైగా ఉన్నారని ఐక్యమత్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో సినీ నటుడు రమే శ్, వడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు శివకుమార్, జేఏసీ చైర్మన్ గోపి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రవి, మహిళా అధ్యక్షురాలు మక్కల ధనలక్ష్మి, నాయకురాలు నిర్మల, ముదిరాజ్ కాలనీ అధ్యక్షుడు ఆలకుంట రాము, ఉపాధ్యక్షుడు బాలు, గౌరవాధ్యక్షులు సిద్ధయ్య, సాలయ్య, బాలస్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.