calender_icon.png 13 February, 2026 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరే మేయర్ ఆశావహులు

13-02-2026 12:00:00 AM

హంగ్ వస్తుందనే ఆశతో ...

కరీంనగర్, ఫిబ్రవరి12(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకమైన కరీం నగర్ నగరపాలకసంస్థ మేయర్ పీఠంపై బీ సీ నేతలు కన్నే శారు. ఎన్నికల్లో తాము పోటీ చెసిన డివిజన్ లో తామే గెలుస్తామని తమ పార్టీయే గెలుస్తుందని, తమకే నగర ప్రధమ పౌరుడిగా అవకాశం వస్తుం దనే ఆశతో ఉ న్నారు. మేయర్ పీఠం బీసీ జనర లీకు రిజ ర్వ్ కాగా, ఆయా పార్టీల నుంచి పలువురు మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఏ పార్టీకి స్పష్ట మైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని, హంగ్ వస్తే చక్రం తిప్పి మేయర్ అవుతామని బీసీ ఆశావహులు పావులు కదుపుతు న్నారు.

తొలిసారి కరీంనగర్ పై కాషాయజెం డా ఎగురవేస్తామనే ధీమా లో బీజేపీ ఉం ది.అధికార పార్టీగా తమకే అవ కాశం ఉం టుందని కాంగ్రెస్ లెక్కలేసుకొంటుంది. జిరో నుండి మ్యాజిక్ ఫిగర్ కు చేరతామని లెక్కలేసుకొంటున్నారు. వరుసగా మూడోసారిపీ ఠం తమదేనని బీఆర్‌ఎస్ అంటుంది. ఓటరన్న ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడో నేడు తేలుతుంది. ఫలితం ఎలా ఉండబోతున్నా ఆయా పార్టీల్లోని బీసీల నేతల మధ్య పోటీ తీవ్రమైంది. 

16 మేయర్ ,చైర్మన్ ల ఎన్నిక

మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల షెడ్యూల్ను కూడా ఎస్‌ఈసీ ప్రకటించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019 లోని సెక్షన్ 20 ప్రకారం.. ఆయా పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు కోసం అధికారులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు 14న లేదా అంతకుముందే నోటీసులు ఇవ్వాలని షెడ్యూల్లో సూచించారు.

ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటల నుంచి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రత్యక్షంగా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయిస్తారు మధ్యా హ్నం 12.30 గంటల తర్వాత మున్సిపాలిటీ చైర్పర్సన్/వైస్త్చ్రర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. చైర్పర్సన్/ మేయర్ ఎన్నికలు పూర్తయ్యేవరకు వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించరు. ఏ కారణం చేత అయినా ఆ పదవుల ఎన్నిక జరుగకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు.

పార్టీ ల వారీగా ఆశావాహులు

బీజేపీ నుంచి మాజీ మేయర్ డి. శంకర్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ , డాక్టర్ పుల్లల పవన్ కుమార్, కొండపల్లి సతీష్ లు మేయర్ పీఠంపై గురిపెట్టారు.పార్టీ గెలిస్తే కేం ద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనూహ్య నిర్ణయమే ఫైనల్ అవుతుంది.కాంగ్రెస్ నుంచి పార్టీ కార్పొరే షన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మాచర్ల ప్రసాద్, కోటగిరి భూమగౌడ్ మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నారు.

బీఆర్‌ఎస్ నుంచి పార్టీనగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీం దర్ సింగ్,జంగిలి సాగర్, బోనాల శ్రీకాంత్, చంద్రయ్య మేయర్ స్థానానికి పోటీపడుతు న్నారు. బీసీ జనరల్ కు రిజర్వ్ కావడంతో తాము కూడా సిద్ధమంటూ బీసీ మహిళలు కూడా సంకే తాలు ఇస్తున్నారు. వీరిలో ఎవరు కార్పొరేటర్గా గెలుస్తారో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో,అనూహ్యంగా ఇతరులకు అవకాశం వస్తుందో నేటి ఫలితాలతో తేలనుంది.