15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ధాన్యం కళ్ళలోకి వచ్చిన ప్రారంభించని కొనుగోలు కేంద్రాలు..

16-10-2025 06:13 PM

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం..

మునుగోడు (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పోశారనీ, అయితే నేటికీ ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు ప్రారంభించకపోవడం రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంగం నాయకులతో కలిసి మాట్లాడారు. రైస్ మిల్లుల కేటాయింపు ఇప్పటికీ జరగలేదని, రైతులు మాచర్ వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో రైతులు నేరుగా రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడి, క్వింటాలుకు రూ.1600–1800 మాత్రమే ఇస్తూ మధ్యవర్తులు దోపిడీ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పత్తి పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పెట్టుబడులు తిరిగి రాని పరిస్థితి నెలకొన్నదని అన్నారు.గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వకపోవడం రైతులపై పెద్ద భారమని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని, వెంటనే ధాన్యం కొనుగోలు చర్యలు ప్రారంభించి, రైస్ మిల్లులను కేటాయించి, బోనస్ చెల్లించాలి అని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యులు శివర్ల వీరమల్లు రైతులు పర్నే సత్తిరెడ్డి, జక్కలి దేవయ్య, గోలి సైదులు, పర్నె కలమ్మ ఉన్నారు.