calender_icon.png 16 October, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ కమిటీ రిపోర్టు ప్రకారం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

16-10-2025 06:16:03 PM

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు సత్యనారాయణ..

జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్న అధికారుల, మంత్రుల సబ్ కమిటీ నుండి పిఆర్సి రిపోర్ట్ తెప్పించుకొని ఫిట్మెంట్ 51 శాతం తగ్గకుండా ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏనుగు సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు కందుకూరి రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశంలో సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగట్లోకి తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించవద్దని కోరారు.బాకీ పడ్డ ఐదు డిఏలకు గాను ఒకటి ఏను వెంటనే ప్రకటించాలని మరో డిఎను దీపావళికి  ప్రకటించి మిగతా మూడింటిని పిఆర్సి లో కలపాలని డిమాండ్ చేశారు.

సబ్ కమిటీ ప్రకటించిన విధముగా పెండింగ్ బిల్లులకు గాను ప్రతి మాసం 700 కోట్లు విడుదల చేస్తూ అట్టి విడుదల చేసిన డబ్బు ఏ ఏ శాఖలకు  జమ చేసారో వివరాలు తెలిపాలన్నారు. సామాన్య ప్రజలకు 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించి ఉద్యోగులకు మాత్రం రెండు లక్షలు మాత్రమే మంజూరి ఇవ్వడం బాధాకరమన్నారు. కమిటీ ప్రతిపాదించిన నగదు రహిత వైద్య పథకం వెంటనే ప్రవేశపెట్టాలని ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో సమానంగా ప్రభుత్వ జమ చేసి ఉద్యోగులందరికీ ఉచిత వైద్యం అందేలా చేయాలని, ఇది ఈ మాసంలోనే ప్రకటించాలని కోరారు.   ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని  కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులందరికీ వారు దాచుకున్న డబ్బు జిపిఎఫ్. జి ఎల్ ఐ, ఆర్జిత సెలవులు, ఉద్యోగ విరమణ  తదుపరి చెల్లించాల్సిన గ్రాట్యూటీ  కమిటేషన్ వెంటనే చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు  కందుకూరి రవిబాబు, కార్యదర్శి మామిడి రమేష్, జగిత్యాల జేఏసీ చైర్మన్ నాగేందర్ రెడ్డి. టీఎన్జీవో  కార్యదర్శి అమరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు బద్దం రాజేందర్ రెడ్డి, అశోక్ రాజు, ఉమేశ్వరి. విజేందర్. సురేష్ రెడ్డి. ప్రవీణ్. సుజాత లక్ష్మి. రమ్య. అక్షయ్ పాల్గొన్నారు.