28 August, 2026 | 8:10 PM

Breaking News

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ : గుండా నిరంజన్   •   సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •  

టెహ్రాన్‌లో చమురు నిల్వ కేంద్రాలపై దాడులు.. భారీ విధ్వంసం

10-03-2026 02:29 AM

చమురు నిల్వ కేంద్రాలే లక్ష్యం 

టెహ్రాన్‌లోని 5చమురు కేంద్రాలు ధ్వంసం

నలుగురు మృతి.. పలువురికి గాయాలు

కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు

టెహ్రాన్, మార్చి 9: ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సోమవారం తెల్లవారుజామున భీకర దాడులు చేశాయి. టెహ్రాన్ పరిసరాల్లోని ఐదు కీలక చమురు నిల్వ కేంద్రాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల వల్ల చమురు నిల్వలు పేలి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. టెహ్రాన్ వీధులంతా ఎటుచూసినా మంటలు వ్యాపించాయి. ఆకాశంలో వందల మీటర్ల ఎత్తున నల్లని పొగలు కమ్ముకోవడంతో పట్టపగలే చీకటి కమ్మినట్లు భయానక వాతావరణం నెలకొంది.

చమురు డిపోలపై జరిగిన దాడుల్లో నలుగురు ట్యాంకర్ డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు. ఇరాన్ పై మున్ముందు మరిన్ని దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ విధ్వంసం చోటుచేసుకుంది. టెహ్రాన్తో పాటు అల్బ్ రోజ్, యాజ్ద్, ఇస్ఫహాన్ ప్రాంతాల్లోనూ అమెరికన్ బలగాలు బాంబులు వేశాయి. అలాగే, ఖుద్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్నీ ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసింది. ఒక్క వారంలోనే 6,500 దాడులు చేసి ఇరాన్ గగనతలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. అమెరికా నుంచి ఇరాన్ కొనుగోలు చేసిన 7 ఎఫ్14 ఫైటర్ జెట్లను కూడా ఇస్ఫహాన్ ఎయిర్‌పోర్టులో ధ్వంసం చేశామని వెల్లడించాయి. 


ఇవి కూడా చదవండి:

మొజ్తాబా ఖమేనీ ఎంపికపై ట్రంప్ ఆగ్రహం.. ‘ఇరాన్ తప్పు చేసింది’

ఇరాన్ యుద్ధం 11వ రోజు.. విమానాశ్రయాలపై దాడులు, డ్రోన్ దాడులతో ఉద్రిక్తత

బ్యారెల్‌కు $110 చేరిన ముడి చమురు.. రూపాయి పతనం, ఆర్థిక వ్యవస్థపై భారం