20 June, 2026 | 6:37 PM

Breaking News

మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం   •   కనగర్తిలో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు   •  

లెబనాన్‌లో రసాయన దాడి?.. ఇజ్రాయెల్‌పై ఆరోపణలు

10-03-2026 02:27 AM

ఇజ్రాయెల్ రసాయన ఆయుధాల వినియోగం

బీరుట్, మార్చి 9: దక్షిణ లెబనాన్‌లోని జనావాసాలపై సోమవారం ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ‘వైట్ ఫాస్ఫరస్’ అనే ప్రమాదకరమైన రసాయన ఆయుధాలను ప్రయోగించింది. దక్షిణ లెబనాన్‌లోని యోహ్మోర్ పట్టణంలో జరిపిన దాడిలో నివాస సముదాయాలు ధ్వంసమయ్యాయి. నిప్పుల వర్షం కారణంగా పలుచోట్ల ఇళ్లు, వాహనాలు దగ్ధమయ్యాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం జనావాసాల్లో రసాయన ఆయుధాలను వాడటం నేరం. అయితే, ఈ విషయంపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.