రుణమాఫీపై కాంగ్రెస్ అబద్ధాలు
మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
కామారెడ్డి, డిసెంబర్ 1 (విజయక్రాంతి): వందశాతం రుణమాఫీ జరి గిందని కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ఇంకా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. ఆదివారం బిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో అత్యంత వేగంగా పతనం అవుతున్న ప్రభు త్వం రేవంత్‌రెడ్డిదేనన్నారు. ఇచ్చిన హమీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వం నిర్వహించిన సంక్షేమ పథకాలను మధ్యంతరంగా నిలిపివేశా రన్నారు. కె కేసీఆర్ హయాంలో చేసిన రుణమాఫీలో కనీసం సగం కూడా చేయలేకపోయారని ప్రశాంత్‌రెడ్డి ఎద్దేశా చేశారు. ఈ సమా వేశం లో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రాజు, జడ్పీ మాజీ చైర్మన్ విట్టల్ ఠాకూర్, సుజిత్‌సింగ్, ఠాకూర్ పాల్గొన్నారు.




