5 May, 2026 | 3:09 PM

వడదెబ్బతో బాలిక మృతి

05-05-2026 01:35 PM

బోత్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన మడవి శ్రీదేవి(14) అనే బాలిక మంగళవారం ఉదయం మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన బాలిక సోమవారం రాత్రి కి వాంతులు విరోచనాలు చేస్తుందని తెలిపారు తిరిగి మంగళవారం ఉదయం బహిర్భూమి కని వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లోనే కుప్పకూలిపోయిందని తండ్రి మారుతి తెలిపారు.