5 May, 2026 | 2:47 PM

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు

05-05-2026 01:39 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన శాలివాహన విద్యార్థులను మండల నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా పోతుగంటి రుత్విక్ తేజ 567 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచగా, వంగపల్లి రుచిత 528, ఇద్దగిరి పూజశ్రీ 521, వంగపల్లి శరణ్య 501, వంగపల్లి ప్రణయ్ 458, ఇద్దగిరి రిశాంత్ 452 మార్కులు సాధించి మంచి ఫలితాలు నమోదు చేశారు. అలాగే వంగపల్లి అభినయ్, వంగపల్లి రుత్విక, వంగపల్లి వంశీకృష్ణ తదితర విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించి శాలివాహన పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... “పేదరికం నుంచి బయటపడే దారి, కష్టాలను జయించే శక్తి, భవిష్యత్తు నిర్మాణం, గౌరవం పొందే మార్గం అన్నీ చదువుతోనే సాధ్యం. చదువు మాత్రమే నిజమైన భవిష్యత్తును ఇస్తుంది” అని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఇలాగే చదువుల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వంగపల్లి పరశురాములు, మాజీ వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంగపల్లి దేవరాజ్, శేఖర్, భిక్కనూరి భూమలింగం, ఇద్దగిరి రవి కిషన్, మండల యూత్ అధ్యక్షుడు వంగపల్లి రాము, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.