కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం
05-05-2026 01:28 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని కన్నాల గ్రామ అభివృద్ధికై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సిఆర్ఆర్ఎస్ సి సబ్ ప్లాన్ కింద పది లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు మంగళవారం కన్నాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ మాట్లాడుతూ... కన్నాల గ్రామాభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు ఎన లేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద పది లక్షల రూపాయలు కన్నాల ఎక్స్ రోడ్డు నుండి వెంకటేశ్వర దేవాలయం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, మల్లెపల్లి, కన్నాల లింక్ రోడ్డు నిర్మాణం, కన్నాల ఎక్స్ రోడ్డు వద్ద బస్టాప్ మంజూరు చేసినందుకు మంత్రి కి ఎంతో రుణపడి ఉంటామని తెలియజేశారు.






