8 July, 2026 | 8:18 PM

Breaking News

ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •  

ఆగని పసిడి పరుగు

20-10-2024 12:00 AM
  1. హైదరాబాద్‌లో రూ.79,420 వద్ద సరికొత్త రికార్డు 
  2. 4 రోజుల్లో రూ.2,000 ప్రియం
  3. ప్రపంచ మార్కెట్లో 2,736 డాలర్ల ఆల్‌టైం గరిష్ఠస్థాయికి ఔన్సు ధర 

హైదరాబాద్, అక్టోబర్ 19: ధనతెరాస్, దీపావళి పండుగలకు బంగారం కొనాలనుకున్నవారికి నిరుత్సాహాన్ని కల్పిస్తూ ఏ రోజుకారోజు ధర ఎగిసిపోతున్నది.  ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు కొనసాగుతాయన్న అంచనాలతో పాటు, మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు, రానున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికల పట్ల అనిశ్చితి బం గారాన్ని పరుగులు తీయిస్తున్నాయి. 

తాజా గా అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయంగానూ సరికొత్త రికార్డు స్థాయికి పుత్తడి పెరిగింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర  చరిత్రలో తొలిసారిగా శుక్రవారం రాత్రి 29 డాలర్ల మేర పెరిగి 2,736 డాలర్ల వద్దకు చేరింది. దీనితో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర శనివారం మరో రూ. 440 పెరిగి రూ.79,420 వద్దకు చేరింది.

వరుస నాలుగు రోజుల్లో తులం ధర రూ.2,000 ఎగిసింది.  ప్రపంచంలో ఇన్వెస్టర్ల డిమాండ్‌కు తోడు స్థానిక మార్కెట్లో రానున్న ధన తెరాస్, దీపావళి నేపథ్యంలో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలు పుత్తడి జొరు కు కారణమని బులియన్ ట్రేడర్లు తెలిపారు. తాజాగా ఇదేబాటలో 22 క్యారట్ల ఆభరణాల బంగారం తులం ధర మరో  రూ.400 పెరిగి రూ.72,800 వద్దకు చేరుకున్నది.