22-05-2025 12:00:00 AM
కామారెడ్డి, మే 21 (విజయ క్రాంతి) : వాతావరణ శాఖ తెలిపినట్లుగానే వర్షం కామారెడ్డి జిల్లాలో భారీగా ఉందని చెప్పినట్లుగానే బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి 7 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో భారీ గా నష్టం వాటిల్లింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో ఈదురు గాలుల కారణంతో పంచాయతీరాజ్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కరెంటు స్తంభాలు గాలి దుమారానికి రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో తృతిలో పెను ప్రమాదం తప్పినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. స్థానికులు మాత్రం విద్యుత్ అధికారుల నిర్లక్ష్య మూగ వ్యవహరించడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంటు వైర్లు పక్కనున్న చెట్లను తొలగించాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరు చెట్లు, ఎనిమిది విద్యుత్ స్తంభాలు విరిగి పోయినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ నియోజక వర్గాలలో అకాల వర్షం ,ఈదురుగాలు ల వల్ల ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు.
ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు విద్యుత్ అధికారు లు స్పందించి విద్యుత్ వైర్లు, ధ్వంసమైన విద్యుత్ స్తంభాల కు సంబంధించిన చర్యలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలా వద్ద ధాన్యం నిలువలు వర్షానికి తడిసి కొన్ని చోట్ల కొట్టుకపోయా యని రైతులు తెలిపారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ఈదురుగాలులకు విరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో టేక్రియాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై లారీని కంటైనర్ ఢీకొనడంతో లారీ డ్రైవర్ తీవ్రగాయాలయ్యాయి. గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. దేవునిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాపిక్ ను పునరుద్ధరించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై కలెక్టర్ ఆశిష్ సంగు వన్ వ్యవసాయ అధికారుల నుంచి వివరాలు సేకరించగా 139 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలు అందించినట్లు సమా చారం.
దుక్కులు దున్నిపెట్టిన రైతులకు అకాలవర్షం వల్ల నష్టపోయినట్లు రైతులు తెలిపారు. మళ్లీ దుక్కులు దున్నాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు. చేతికొచ్చిన పంట దెబ్బతిందని ఈ వర్షం వల్ల రైతులకు ఎలాంటి లాభం లేదని నష్టమే మిగిలిందని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మహిళ రైతు సంగవ్వ ఆవేదన వ్యక్తం చేసింది.