calender_icon.png 22 May, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు

21-05-2025 11:37:38 PM

ఎస్ఐ విజయకొండ..

కామారెడ్డి (విజయక్రాంతి): సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని మద్నూర్ ఎస్సై విజయ్ కొండ(SI Vijay Konda) సూచించారు. బుధవారం డోంగ్లి మండల కేంద్రలో సైబర్ నేరాలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గుట్కాలు ప్రమాదకరమన్నారు. యువత వాటి జోలికి పోవద్దని, వ్యసనాలకు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు ఇంటర్నెట్ సద్విని చేసుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఎటువంటి లావా దేవీలు జరపవద్దన్నారు. బ్యాంకు ఖాతా, ఓటిపి వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు చెప్పకూడదన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉంటే వారి ఉచ్చులో పడకుండా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు