21-05-2025 11:40:17 PM
అవగాహన సదస్సు కల్పించిన పాస్టర్ యేసయ్య..
కోదాడ: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బాప్టిస్ట్ చర్చి పాస్టర్ యునైటెడ్ అసోసియేషన్(Baptist Church Pastors United Association) అధ్యక్షుడు యేసయ్య బుధవారం అన్నారు. యువత సోషల్ మీడియా ప్రలోభానికి గురికాకుండా బాప్టిస్ట్ చర్చిలో అవగాహన సదస్సు కల్పించామని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ... మద్యం, డ్రగ్స్, చెడు వ్యసనాలకు యువత చెడిపోతుందని అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీనివాస్ రావు, యలమర్తి శౌరి, పూర్ణ శశికాంత్, యాతాకుల జ్యోతి, ఒంటెపాక జానకి, బొల్లికొండ కోటయ్య, శ్యాం బాబు, మేరమ్మ,సీత శార సునీత, సలోమి, మెసేస్ రాంబాబు ఎనోష్ తదితరులు పాల్గొన్నారు.