13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అకాల వర్షం... అపార నష్టం

31-03-2026 06:44 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం వల్ల పలుచోట్ల మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. మండలంలోని రేగడి మద్దికుంట, కనుకుల, చిన్నకల్వల, సుద్దాల, మంచరామితో పాటు పలు గ్రామాల్లో  చేతికి పంట అందే   సమయంలో ఈ అకాల వర్షం పడడం రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఏఈఓలు  పరిశీలించారని, సుల్తానాబాద్ మండలంలో 484 మంది రైతులకు సంబంధించిన  460 ఎకరాల్లో  మొక్కజొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి పైడితల్లి తెలిపారు, ఏ డి ఏ టెక్నికల్ అధికారి కాంతారావు నెలకొరిగిన పంటలను పరిశీలించారు,  కాగా  ప్రభుత్వం పంటకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని పలు గ్రామాల  రైతులు కోరుతున్నారు.