తరిగొండ వెంగమాంబ చరితం ఆవిష్కరణ
04-05-2026 02:04 AM
- కీర్తనలు ప్రాచుర్యం పొందేలా టీటీడీ కృషి చేయాలి
- 296వ జయంతి వేడుకల్లో గజల్ శ్రీనివాస్
తిరుపతి, మే 2 (విజయక్రాంతి): శరణాగ తి, సేవా భావాలు నిండిన మహా భక్తురాలు శ్రీతరిగొండ వెంగమాంబ అని, ఆమె రాసిన కీర్తనలు మరింత ప్రాచుర్యం పొందేలా తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేయాలని గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం శ్రీ మం త్రరాజ పీఠాధిపతి శ్రీశ్రీ సింహయాజిస్వామి వారు రచించిన ‘తరిగొండ వెంగమాంబ చరితం’ గ్రంథాన్ని తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాల సందర్భంగా తిరుపతి దేవలోక ప్రాంగణంలో వేలాదిమంది గోవింద భక్తుల సమక్షంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు, ప్రఖ్యాత గజల్ గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేదిక్ విశ్వ విద్యాలయ ఉప కులపతి ఆచార్య రాణి సదా శివమూర్తి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.






