29 May, 2026 | 1:42 AM

2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం

29-05-2026 12:00 AM

అమీర్ పేట్ మైత్రీవనం సర్కిల్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు కాంస్య విగ్రహావిష్కరణ

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్

హైదరాబాద్, సికింద్రాబాద్ మే28 (విజయక్రాంతి): కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు... మహాపురుషులౌతారు‘ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్. తెలుగు ప్రజల ఆరాధ్యుడు, విశ్వ విఖ్యాతుడు, మహామనిషి శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.

1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు. సినీ వినీలాకాశంలో రాముడుగా, కృష్ణుడుగా చెరగని ముద్ర వేసిన ఆయన రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారు.

తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త ఆయన. ఆ యుగ పురుషుడికి మరొక్కమారు శ్రద్ధాంజలి.. హైదరాబాద్ నగరంలోని అమీర్ పేట్ మైత్రీవనం సర్కిల్‌లో ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కాంస్య విగ్రహా విష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన  కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సమయంలో విగ్రహ ఏర్పాటుపై రేవంత్ హామీ ఇచ్చారు. దేశం గర్వించ దగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్. తెలుగుజాతి అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషం.దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గు రు జాతి రత్నాలను తలచుకోవాలి.దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు తెలుగుజాతికి స్ఫూర్తిని నింపిన నేత ఎన్టీఆర్. దేశ చరిత్రలో స్పూర్తిదాయ నేతలు ముగ్గురు జాతిరత్నాలు.

భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కును కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మొదటగా స్మరించు కోవాలి రెండో వ్యక్తి ఇందిరాగాంధీ.. భూ సంస్కరణలు తెచ్చి పేదలకు పంచి హక్కులు కల్పించిన ఉక్కుమహిళఇందిరా గాంధీని తలచుకోవాలి. మూడోతరం ఎన్టీఆర్ .. నీతి, నిజాయితీ, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎన్టీఆర్‌ను  ఉక్కు సంకల్పంతో పనిచే సిన వ్యక్తి. అన్ని సీఎం రేవంత్ అన్నారు. మానవ మనుగడ ఉన్నంత కాలం ఈ ముగ్గురు జాతిరత్నాలను స్మరించుకోవాల్సిందే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటని కొందరు మాట్లాడుకుంటున్నారు. విమర్శలు చేస్తున్నారు.

కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు.. రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తి..ఒక ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవిత కాలం గుర్తుండిపోయే జ్ఞాపకం, తుమ్మల, మండవ, కడియం, మోత్కుపల్లి లాంటి ఎందరో నాయకులను తెలంగాణకు అందించిన ఘనత ఎన్టీఆర్‌ది, కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావును కూడా గుర్తించి నాయకుడిని చేసింది ఎన్టీఆర్ నే.వాళ్ళే కాదు ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆయన విగ్రహాన్ని పెట్టడాన్ని విమర్శిస్తున్నారు. కొందరు నకిలీల మాటలను పట్టించుకోవల్సిన అవసరం లేదు. 

సన్నబియ్యం అందించే స్ఫూర్తి వెనక అన్నగారు అందించిన రూ.2 కిలో బియ్యం పథకం ఉంది.ఆడబిడ్డలకు చీరలతోపాటు అనేక సంక్షేమ పథకాలు అందించడంలో ఎన్టీఆర్ స్ఫూర్తి ఉంది,బలహీన వర్గాలు పాలకులుగా మారడం వెనక అన్నగారి సహకారం, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదలు ఆత్మ గౌరవంతో బ్రతికే అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్ ది. మా ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాల్లో ఇందిరమ్మ, ఎన్టీఆర్ స్ఫూర్తి కనిపిస్తుంది. 

ఇందిరమ్మ ఒక తరం అయితే..ఎన్టీఆర్ ఒక శకం.. ఆ ఇద్దరి స్ఫూర్తితో ప్రజా పాలన అందిస్తున్నాం. అన్న గారు ఆనాడు ఆడబిడ్డలకు కల్పించిన హక్కుల స్ఫూర్తిగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం.రైతును రాజును చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆనాడు రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్ కల్పిస్తే అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ ది. 

అన్న గారి స్ఫూర్తితోనే నిరుపేదలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం.మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మహిళల కోసం 60 వేల కోట్లు ఖర్చు చేశాం. ఉపఎన్నికల్లో మీ అందరూ అండగా ఉండటం వల్లే ప్రజా పాలన ముందుకు సాగుతోంది. భవిష్యత్ లోనూ మీ సహకారం ఇలాగే కొనసాగాలి. 

2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం.. హైదరాబాద్ నగరాన్ని అంతరా తీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నాం. ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాం అన్ని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఎన్టీఆర్ కుమారులు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ, సినీనటుడు మంచు మనోజ్, దర్శకుడు బోయపాటి శ్రీను, పెద్ద ఎత్తున అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.