21 May, 2026 | 3:35 PM

Breaking News

విద్యార్థి పేరెంట్స్ కమిటీ పోస్టర్ ఆవిష్కరణ.!

21-05-2026 02:31 PM
  1. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదు
  2. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే టీఅర్పి లక్ష్యం.. తీన్మార్ మల్లన్న
  3. టీఆర్పీ లో భారీ చేరికలు.. 2029లో బీసీ రాజ్యమే లక్ష్యo

మేడిపల్లి, మే 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క పేద విద్యార్థి చదువు కూడా మధ్యలో ఆగిపోకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించే ఆర్టీఈ (RTE) చట్టాన్ని కచ్చితంగా అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు అని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ బందారం నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో  పార్టీ కార్యాలయంలో విద్యార్థి పేరెంట్స్ కమిటీ’ పోస్టర్‌ను పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా టీఆర్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మింగాలి నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క పేద విద్యార్థి చదువు ఆగిపోకూడదన్నదే తమ పార్టీ ప్రధాన ఆశయమన్నారు. 2029లో బీసీ పార్టీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యూత్, మహిళా కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి  అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు జాంగిర్, మజీద్ భాయ్, జలీల్ అర్జున్, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మదినగూడ మహిళా అధ్యక్షురాలు నీలవేణి, సీనియర్ నాయకుడు కృష్ణ పటేల్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు జనార్దన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.