11 August, 2026 | 3:08 AM

చేయూత పెన్షన్లలో అక్రమాలపై అనుమానాలు

21-05-2026 02:34 PM

సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందుతున్న వారిపై నిఘా అవసరం

కారేపల్లి,(విజయక్రాంతి): చేయూత పెన్షన్లు(Cheyutha Pensions) పొందుతున్న లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డుతో పెన్షన్(Pension with Aadhaar Card) ఆథెంటికేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతోంది. ఇంకా ఆథెంటికేషన్ చేయించుకోని వారు తమ ఆధార్ కార్డుతో సంబంధిత పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే గ్రామాల్లో అక్రమంగా సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్న వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్న వారిని ఎంతమందిని గుర్తించారు..? ఇప్పటివరకు ఎన్ని పెన్షన్లు తొలగించారు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.అక్రమాలను అరికట్టాల్సిన  అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి సదరం సర్టిఫికెట్ల ద్వారా పింఛన్లు పొందుతున్న వారిపై గ్రామస్థాయిలో విచారణ జరిపి  నిజమైన అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టి పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.