calender_icon.png 6 October, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్, నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు సత్వరమే పూర్తి చేయాలి

05-10-2025 12:00:00 AM

  1. 6న ఉప్పల్ రింగ్ రోడ్‌లో సీపీఎం దీక్షలను జయప్రదం చేయండి
  2. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోమటి రవి

ఘట్ కేసర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 8ఏండ్లు కావొస్తున్న నిధులు విడుదల చేయకుండా పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని సీపీఎం  మేడ్చల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి విమర్శించారు. శనివారం ఘట్ కేసర్ పట్టణంలో సీపీఎం మండల కమిటీ సమావేశం జరిగింది. 

ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి మాట్లాడుతూ 6.2 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న ఈకారిడార్ 19నెలల్లో పూర్తి చేస్తా మని చెప్పి విస్మరించారని పేర్కొన్నారు. రూ. 670 కోట్లు కేటాయింపులు   జరపడంతో పాటు  భూసేకరణ క్రింద రూ. 768 కోట్లు కేటాయిస్తామని చెప్పి కనీసం 50 శాతం నిధులు కేటాయించలేదన్నారు. 2019 సంవత్సరం లోపే పూర్తి చేయాల్సి ఉండగా 7 ఏండ్ల కాలంలో కూడ పూర్తి చేయలేదన్నారు. 143 ఫిల్లర్లకు గాను కేవలం 38 ఫిల్లర్స్ పూర్తి చేశారని విమర్శించారు. ఇప్పటికైనా తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారం భించాలని డిమాండ్ చేశారు.

ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిం చారు. సీపీఎం ఇప్పటికే సంతకాల సేకరణ చేపట్టిందన్నారు. అక్టోబర్ 6న ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు చింతల యాదయ్య, మండల కార్యదర్శి ఎన్. సబిత మండల కమిటీ సభ్యులు కొయ్యడ చంద్రమోహన్, జి. నాగమణి, కె.అలివేల, బి. సునీతదేవి, కె. రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.