1 April, 2026 | 7:14 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

జాతీయ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్‌కు కేటీఆర్

05-10-2025 12:00 AM

-పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

-ఈ నెల 11న కోయంబత్తూరులో ప్రారంభంకానున్న ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్   

-101 కాలేజీల నుంచి 1300 మందికి పైగా యువ ఇంజినీర్ల భాగస్వామ్యం

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో జాతీయ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్టోబర్ 11న కోయంబత్తూరులోని కుమారగురు ఇనిస్టిట్యూషన్స్‌లో జరగనున్న 10వ ఎఫ్‌ఎంఏఈ(ఫ్రాటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్) నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 ప్రారంభోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఎఫ్‌ఎంఏఈ ఆధ్వర్యం లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలో దేశవ్యాప్తంగా 101 కాలేజీల నుంచి 70కి పైగా విద్యార్థి బృం దాలు, మొత్తం 1300 మందికి పైగా యువ ఇంజనీర్లు పాల్గొననున్నారు. విద్యార్థులు  స్వయంగా రూపొందించిన వాహ నాలు, వినూత్న ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టులను అంతర్జాతీయ స్థాయిలోని అగ్రగామి ఆటోమోటివ్ కంపెనీలకు చెందిన 25 మంది నిపుణుల జ్యూరీ సభ్యులు మూల్యాంకనం చేయనున్నారు. 

కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశంసించిన ఎఫ్‌ఎంఏఈ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పంపిన ఆహ్వానంలో ఎఫ్‌ఎంఏఈ సంస్థ ఆయన నాయకత్వాన్ని, మోటార్ స్పోర్ట్స్ పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు ఫార్ములా- రేసింగ్‌ను తీసుకురావడం ద్వారా తెలంగాణను గ్లోబల్ మోటార్ స్పోర్ట్స్ మ్యాప్‌పై నిలబెట్టడంలో కేటీఆర్ పోషించిన పాత్ర అభినందనీయమని కొనియాడింది. సుస్థిరమైన మొబిలిటీ, అడ్వాన్స్‌డ్ మానుఫ్యాక్చరింగ్ (తయారీ), ఆవిష్కరణల వ్యవస్థను (ఇన్నోవేషన్ ఎకోసిస్టం) ప్రోత్సహించడంలో ఆయన చూపిన చొరవ దేశవ్యాప్తంగా వేలాది మంది యువ ఇంజనీర్లకు స్ఫూర్తిని ఇచ్చిందని ఎఫ్‌ఎంఏఈ పేర్కొంది. ఈ పోటీ భారత దేశంలోని అత్యున్నత విద్యార్థి-కేంద్రీకృత ఇంజనీరింగ్ ప్లాట్‌ఫాముల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది పరిశ్రమ, విద్యా రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడంతో పాటు, భవిష్యత్ ఆటోమోటివ్ టెక్నాలజీలకు భారతదేశాన్ని ఒక కేంద్రంగా నిలబెట్టే లక్ష్యంతో కృషి చేస్తోంది.