calender_icon.png 12 August, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ నారపల్లి రోడ్డుకు మరమ్మతులు చేయాలి

12-08-2025 12:37:52 AM

మేడ్చల్, ఆగస్టు 11(విజయ క్రాంతి): ఉప్పల్ నారపల్లి రోడ్డు అద్వాన్నంగా తయారైనందున మరమ్మతులు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జీలు వజ్రెష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు.

సోమవారం మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించి, వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అలాగే ఫ్లైఓవర్ పనులు ప్రారంభించి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని, ఫ్లైఓవర్ పనుల విషయంలో కేంద్ర మంత్రులతో మాట్లాడుతానని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.