calender_icon.png 9 September, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కరువు తీరట్లే

09-09-2025 12:07:06 AM

  1. నామమాత్రపు చర్యలు ఇంకెన్నాళ్లు 

ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): యూరియా కరువు తీరట్లేదని ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రం బోయపల్లి రోడ్డు న్యూగంజ్ లోని హకా రైతు సేవా కేంద్రం వద్ద మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్  యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

ఈ  సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి.... తెల్లవారుజామున నుండి రైతులు యూరియా కొరకు లైన్ లో ఉన్నారు. వారికి త్రాగు నీరు ను అందించాలన్నారు. రైతులందరికీ యూరియా అందేవిధంగా స్టాక్ తెప్పించుకోవాలన్నారు.

రైతులకు ఎకరానికి 2 యూరియా బస్తాలు పంపిణీ చేయాలన్నారు. ఇంతకు ముందు రైతులకు ఆధార్ కార్డు పై యూరియా పంపిణీ చేసిన విధంగా, రైతులను పట్టాదారు పాస్ పుస్తకం కావాలని తిప్పించుకోకుండా పంపిణీ చేయాలన్నారు. ఇలా నిర్లక్ష్యం వహించడం వల్ల రైతుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నేతలు తదితరులుఉన్నారు.