calender_icon.png 9 September, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

09-09-2025 12:08:22 AM

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) : ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్ కేసర్  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ మున్సిపల్ ఎదులాబాద్ వంజరివాడకు చెందిన ఆముద సంతోష్ అలియాస్ సాగర్ (25) సోమవారం  ఉదయం 4 గంటలకు చీర సహాయంతో ఫ్యాన్ హుక్ నకు ఉరి వేసుకున్నాడు. ఆముద బాలమణి చూసి ఇంట్లో వాళ్లకి తెలియజేసి వెంటనే కిందకు దించి చూసే సరికి అప్పటికే చనిపోయి ఉన్నాడు.

మృతుడు సంతోష్ గత కొంతకాలం నుండి మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటూ ఎలాంటి పని లేకపోవడంతో మనస్థాపo చెంది ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లి ఆముద రోజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  పోస్టుమార్టం నిమిత్తం  మృతదేహాన్ని నగరంలోని గాంధీ హాస్పిటల్ కి  తరలించడం జరిగిందని పోలీసులు తెలిపారు.