యుద్ధానికి కాలపరిమితి లేదు — జెరూసలెంలో పేలుళ్లు, ఇస్ఫాహాన్‌పై బంకర్ బస్టర్ బాంబులు!
ఇరాన్ పై యుద్ధానికి ఎలాంటి కాలపరిమితి లేదు: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి : ట్రంప్ వీడియో పోస్ట్
టెహ్రాన్: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. జెరూసలెంలో 10కి పైగా పేలుళ్లు జరిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ దాడులను వైమానిక దళాలు తిప్పికొడుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇరాన్ లో అణు మౌలిక కేంద్రాలు ఉన్న ఇస్ఫాహాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షంగా కురిపించాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇస్ఫాహాన్‌పై దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ లో పోస్టు చేశాడు.
ఇరాన్ పై యుద్ధానికి ఎలాంటి కాల పరిమితి లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ లో సగానికి పైగా లక్ష్యాలను పూర్తి చేశామని నెతన్యాహు వివరించారు. ఇరాన్ అణ్వస్త్వ తయారీ సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు. భవనాలు, పలకల తాపడాలు కలిగిన మసీదులు, మీనార్లు, తొమ్మిది లేదా పది అణుబాంబులను తయారు చేయడానికి సరిపడా యురేనియం నిల్వలకు ప్రసిద్ధి చెందిన ఇస్ఫాహాన్‌పై దాడి చేయడానికి, అమెరికా 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించింది.




