2 July, 2026 | 12:19 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

నిరుపయోగంగా ధాన్యం పట్టే యంత్రం

13-10-2025 12:00 AM

యంత్రం ఉపయోగిస్తే రైతుకు జేబుకు చిల్లే?

వలిగొండ, అక్టోబర్ 12 (విజయక్రాంతి):వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన తాలు, మట్టిని వేరు చేసే యంత్రం నిరుపయోగంగా ఉత్సవ విగ్రహంగా మారింది. రైతులు తమ వరి పంటలను మిషన్ల ద్వారా కోయించి నేరుగా మార్కెట్ కు తరలిస్తుండడంతో ధాన్యంలో తాలు, మట్టి వంటివి ఉండిపోతున్నాయి.

అయితే వాటిని వేరు చేసేందుకై మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన యంత్రం రైతులు ఉపయోగించుకోవాలంటే ఎకరానికి దాదాపు 5వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని దీంతో తమ జేబుకు చిల్లు పడడం తప్పదని రైతులు యంత్రాన్ని ఉపయోగించడం లేదు.

దీంతో ధాన్యం పట్టే యంత్రం కవర్లతో కప్పి నిరుపయోగంగా దర్శనమిస్తుంది. అనాలోచిత నిర్ణయాలతో లక్షల రూపాయలు పెట్టి వీటిని కొనుగోలు చేసే బదులు మరిన్ని కాంటాలు పెంచి ధాన్యం కొనుగోలు వేగం అయ్యేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.