13-10-2025 12:00:00 AM
-ఇసుక లారీలతో ఇబ్బందులు
-అస్తవ్యస్తమైన రోడ్డు వ్యవస్థ
-అడుగడుగునా ట్రాఫిక్ జామ్
-అంబేద్కర్‌నగర్ రోడ్లపై చెత్త
-వార్తలకు స్పందించని అధికారులు
-మండల అధికారులు ఉన్నట్టా.. లేనట్టా..
చర్ల, అక్టోబర్ 12 (విజయక్రాంతి): చర్ల మండలం అనగానే మరో కోనసీమ గుర్తుకు వచ్చేది నిత్యం తాలి పేరు సోయగాలు అడుగడుగునా పచ్చిక బయళ్ళు ప్రకతి సోయగాల ప్రతిబింబాలు చర్ల మన్యం లో ఊరూరా రైతన్నలే సుందర ప్రదేశాలు పర్యాటకంగా మారిన తాలిపేరు ప్రాజెక్టు, చర్ల మండలం అనగానే దారి పొడుగునా ఇరువైపులా పచ్చని పొలాలతో నిత్యం కాలువ లతో కలకల్లాడే చర్ల మండలం నేడు అందవికారంతో రహదారి వ్యవస్థ సరిగా లేక గుంతల మయంమై పలు ప్రాంతాలలో చెత్తాచెదారంతో కళా హీనంగా తయారైంది.
అనాటి సోయగాలు నేడు విలవిలలాడిపోతున్నాయి, మండల కేంద్రంలో ఇసుక లారీల రద్దీ పెరిగి రోడ్డు వ్యవస్థ పూర్తిగా ధ్వంశానిపితుంది, వెంకటాపురం నుండి చెర్ల మీదుగా భద్రాచలం ఈ రహదారి వెంట ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది, గత కొన్ని నెలల క్రితం సుమారు ఈ రహదారి వెంట ఇసుక లారీ ప్రమాదాలు జరిగి సుమారు పదిమంది వరకు మరణించిన ఘటనలు లేకపోలేదు, రహదారి వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైన అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప రహదారి వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి చర్ల మండలంలో కనిపిస్తుంది,
ఊరంతా చెత్తతో పూడుకుపోయిన కాలువలు
పాత చర్ల అంబేద్కర్ నగర్ గిరిజన బాలికల వసతి గహం ఎదురుగా రహదారి వెంట ప్రయాణం చేస్తున్న వారికి చెత్త దర్శనమిస్తోంది, దీంతో పందులు, కీటకాలు, ఈగలు, దోమలు, విపరీతంగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తు న్నాయి. కాలనీవాసులు ఈ సమీపంలో చెత్తకుండీ ఉన్నప్పటికీ ఇలా రోడ్డుపై చెత్త పడేయడంతో ఈ ప్రాంతం అంత దుర్గంధం వెదజల్లుతుంది.
పంచాయతీ అధికారులు కూడా ఈ ప్రాంతం లో ఇలా రోడ్డుపై పడి ఉన్న చెత్తను పట్టించుకోవడం లేదు కనీసం కాలనీవాసులు కూడా కొందరు నిత్యం పరిశుభ్రతను పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో గడుపు తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు అంబేద్కర్ నగర్నందు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి, ఈ చెత్తాచెదారం అంతా బాలికల వసతి గహంలో ముందే ఉండటం తో చదువుకునే విద్యార్థునులకు నిత్యం దుర్గంధం వస్తుందని వాపోతున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతమంతా వరదతో బురదమయం అవుతుంద. మురికి కాలువలు మొత్తం చెత్తతో పూడుకుపోవడం తో రహదారంతా బురదమయం అవుతుంది చెత్తాచెదారం కాలువలో చేరి మురికి నీరు రహదారి వెంట ఏరులై పాడుతుందనీ గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు ,ఇకనైనా పంచాయతీ అధికారులు దష్టి సారించి అంబేద్కర్ నగర్లో గల ఈ ప్రాంతం రహదారిపై పడవేసిన చెత్తను శుభ్రపరిచి కాలనీవాసుల , వస్తే గహ లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు
తాలిపేరు వంతెన పై ప్రయాణం నరకం
తాళి పేరు వంతెన గోదావరి దాని పేరు బ్యాక్ వాటర్ వలన నిత్యం గలగల పారే నీటి పరవాళ్ళు చూసేందుకు వంతెన పైనుంచి ఆహ్లాదకరమనిపించేది అలాంటిది ఇప్పుడు చర్ల సమీపిస్తుంది అనగానే వంతెన పేరు చెప్పగానే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు నరకం చూస్తున్నారు. బ్రిడ్జిపై వాహనాలు ప్రయాణం చేస్తుంటే బేరింగ్లు పోతున్నాయని. వాహనాలు పాడైపోతున్నాయని టూవీలర్ వాహనదారులు మ్యాజిక్ డ్రైవర్లు వాపోతున్నారు , పలుమార్లు ఈ అంశంపై అధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా పోయింది,
మండల అధికారులు ఉన్నట్టా ? లేనట్టా?
ఇంత జరుగుతున్న మండలంలో సమస్యలు ఎవరికి విన్నవించిన ఎవరు పట్టించుకోని పరిస్థితి మండలంలో కనిపిస్తోంది, మండల సమస్యలపై అధికారులు స్పందించిన దాఖలాలు లేవని చెప్పాలి పోలీసు వ్యవస్థ మాత్రమే ఇసుక లారీల సమస్యల పట్ల మరియు క్రైమ్ వ్యవహారాలకు వెంటనే స్పందిస్తున్నారు, మరే ఇతర అధికారులు కూడా ప్రజా సమస్యలను పక్కకు పెడుతూ చూసి చూడనట్టు వెళ్తున్నారు, దీంతో మండలంలో అధికారులు ఉన్నట్టా లేనట్టా అని ప్రజలు సందిగ్ధంలో పడుతున్నారు.
ఒకప్పుడు చర్ల అంటే సుందర వాతావరణం కలకు కళాకారులకు నిలయంగా ఉండేది అటువంటి చర్ల నేడు అంద వికారంగా సమస్యలతో సతమతమవుతోంది. ఏమైనప్పటికీ చర్ల మండలం గత వైభవాన్ని కోల్పోయి వ్యాపార లావాదేవీలతో అతలాకుతలమవుతుందని చెప్పవచ్చు.