calender_icon.png 13 October, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా మొరం తవ్వకాలు

13-10-2025 12:29:45 AM

  1. జేసీబీ టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు 

అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులదే మొరం దందా 

అడ్డు లేదనుకుంటే షాక్ ఇచ్చిన పోలీసులు 

అనుమతులు లేకుండానే అక్రమ తవ్వకాలు చేపడుతూ మొరం రవాణా 

చెక్ పెట్టిన పోలీసులు కామారెడ్డి జిల్లా తాడువాయి, సదాశివ నగర్, గాంధారి మండలాల్లో కొనసాగుతున్న దందా 

కామారెడ్డి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏదేచ్చాగా కొనసాగిస్తున్న మొరం దందాకు ఆదివారం రాత్రి పోలీసులు చెక్ పెట్టారు.అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసి గుట్టుగా ఆక్రమ మొరం దంధాను కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధి లోని తాడువాయి, సదాశివ నగర్, గాంధారి మండలాల్లో గుట్టుగా మొరం మాఫియా మొరం దందాను యదేచ్చ గా కొనసాగిస్తున్నారు.

జెసిబి లతో మొరం గుట్టలను తవ్వి మొరం మాఫియా టిప్పర్ ల  సహయంతో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం రవాణా కొనసాగిస్తున్నారు. గత కొన్ని మాసాలుగా కొనసాగుతున్న అక్రమ మొరం దందా తీరు జిల్లా పోలీసు బాస్ కు సమాచారం అందడంతో అక్రమంగా మొరం దందాలు కొనసాగిస్తున్న ముఠా ఆగడాల కు పోలీసులు చెక్ పెట్టారు.

ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసరావు స్థానిక సిబ్బందితో వెళ్లి  జెసిబిని, టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల, ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెందిన జెసిబి, టిప్పర్లను పోలీసులు సీజ్ చేయడంతో మొరం మాఫియా బిత్తర పోయారు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా సాగిస్తున్న మొరం దందాకు అడ్డు అదుపు లేకుండా కొనసాగించిన అక్రమార్కులు సాగించిన మొరం దందాకు పోలీసులు చెక్ పెట్టడంతో షాక్ కు గురయ్యారు.

ఇన్ని రోజులు ఎదురు లేదు అనే విధంగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం దంధాను సాగిస్తున్న ముఠాకు పోలీసులు షాక్ ఇవ్వడం తో మొరం దందా నిర్వాకులు ఆందోళన చెందుతున్నారు. వాహనాలను సీజ్ చేయడంతో స్థానిక ఎమ్మెల్యే కు చెప్పిన లాభం లేదని గ్రహించిన మాఫియా ఫైన్ కట్టేందుకు సిద్ధమయ్యారు.

పోలీసుల తీరును స్థానికులు అభినందిస్తున్నారు. అనుమతులు లేకుండానే అక్రమంగా మొరం రవాణా చేస్తున్న వారికి పోలీసులు చెక్ పెట్టడం స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ  ఆక్రమముగా మొరం దందా ను కొనసాగిస్తారా లేక అనుమతులు తీసుకుని మొరం రవాణా కొనసాగిస్తా రో వేచి చూడాల్సిందే.