calender_icon.png 2 February, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనికిమాలిన విచారణ

02-02-2026 01:57:50 AM

మండిపడ్డ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

  1. రాష్ట్రంలో డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్ పాలన 
  2. చెత్త రాజకీయం, లీకులు, పనికిమాలిన విచారణలతో రెండేళ్లు కాలక్షేపం 
  3. సిట్ ఎవరి ఆధీనంలో ఉందో అర్థం కావడం లేదు 
  4. రాష్ట్రంలో నేరాలను కట్టడిచేసే నాథుడే లేరు
  5. ఎనిమిది+ఎనిమిది= సున్నా 
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్‌లా సాగుతున్నదని, అటెన్ష న్ డైవర్ట్ చేయడం, చేతకానితనాన్ని సబ్వర్ట్ చేయ డం, అట్లాగే పర్వర్ట్ రాజకీయాలు చేయడం తప్ప మరేమీ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. తమ నాయకుణ్ణి పనికిమాలిన విచారణల పేరిట పిలిచి వేధిస్తే, తెలంగాణ ప్రజలు బయటకు వస్తారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.

భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బీఎన్‌ఎస్‌ఎస్ చట్టాన్ని కూడా సిట్ గౌరవించలేదన్నారు. సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడించినట్టు ఆడుతున్నా.. బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగా ణ ప్రజల ప్రతినిధిగా కేసీఆర్ మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తిస్థాయిలో విచారణకు సహకరించారని తెలిపారు.

తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, తాము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా, రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా.. చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా, కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు తేటతెల్లమైందన్నారు.

ప్రతిసారి విచారణ సమయంలో ఏదో లీకుల రూపంలో పంపుతారని, ఆ లీకులను దయచేసి విశ్వసిం చవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. కేవలం లీకుల మీద ఆధారపడి ‘ఇదిగో పులి అంటే అదిగో తోక’ అన్నట్టుగా నడుపుతున్నారంటే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతున్నదన్నారు. కేసీఆర్ మీద బురద చల్లాలను కుంటే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టే అవుతుందన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్లీ ‘కాక్ అండ్ బుల్ స్టోరీ’ తయారు చేసి ఏదో జరిగిపోయినట్టు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నాయకత్వంలో సిట్ ఉందా లేక అధికారుల ఆధీనంలో ఉందా అర్థం కావట్లేదని, విచారణ చేసేది సిట్టా లేక పీసీసీనా లేక బీజేపీనా మాకు అర్థం కావడం లేదన్నారు. మా నాయకుడు ఇచ్చిన సమాధానాలతో సిట్‌కు అన్ని విషయాలు కూడా అర్థమై ఉంటాయని, ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్లు తెరుచుకొని ఉంటాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ట్యాపింగ్ జరిగిందా అని అడిగి ఉంటారని, అలాంటిది ఏదీ జరగలేదు, అంతా బోగస్ సష్టి అని చెప్పి ఉంటారని చెప్పారు. మళ్లీ పిలిస్తే వెళ్తాం, సహకరిస్తాం, నష్టం లేదు, మేము చేసిన తప్పు ఏమీ లేదన్నారు. 

నేరాలను పట్టించుకునే నాథుడే లేరు..

రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఈడీ విచారణకు పిలిస్తే రాజ్‌భవన్ ముందు మీ సీఎం, మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారో మేం కూడా అందుకే ధర్నాలు చేశామని మహేష్‌కుమార్ గౌడ్‌కు చురకలంటిం చారు.  హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో, సుల్తాన్ బజార్ పరిధిలో పొద్దున్నే తుపాకీతో కాల్పులు జరిపి రూ.లక్షలు దొంగలు ఎత్తుకొనిపోయినా వారి గురించి పట్టించుకునే నాథుడు గానీ, ఈ రాష్ర్టంలో ఇంత దిగజారిన శాంతిభద్రతల గురించి పర్యవేక్షించేవాడు గానీ, సమీక్ష చేసేవాడు గాని ఈ రాష్ర్టంలో ఎవరూ లేరని మండిపడ్డారు. 

ఎనిమిది+ఎనిమిది= సున్నా...

ఎనిమిది+ ఎనిమిది= సున్నా అనేది కాంగ్రెస్, బీజేపీకి తెలుసు అని ఎద్దేవా చేశా రు. ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్‌కు ఉన్నా, ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నా, తెలంగాణకు గత రెండు బడ్జెట్లలో దక్కింది సున్నా, ఈ బడ్జెట్లో కూడా దక్కిది సున్నా అని.. అందుకే వీళ్ళ వైఫల్యం మీదికి, వీళ్ల చేతకానితనం మీదికి, కేంద్రంతో పోరాడి నిధులు తేలేని తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే  కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే కేసీఆర్‌ను విచారణ పేరిట వెంటబడ్డారని ఆరోపించారు. 

రాష్ట్ర ప్రభుత్వం   ఇకనైనా  అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఆపేసి, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వచ్చిందని సూచించారు. ఇది మీకు మూడో బడ్జెట్ అని, దీని తర్వాత మీకు మిగిలేది ఒకటే బడ్జెట్ ఉంటుందని, ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఎట్లాగో ఎలక్షన్ ఇయర్, మీరు పెట్టిన దానికి చిత్తు కాగితంతో గీకి పారేసిన దానికి ఎంత విలువ ఉంటుందో, లాస్ట్ ఇయర్ మీరు పెట్టే బడ్జెట్ కూడా అంతే విలువ ఉంటుందని ఎద్దేవా చేశారు. మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డుల ద్వారా మేము ప్రతి ఇంటికి మున్సిపల్ ఎన్నికల్లో పోయి వివరంగా చెబుతామని స్పష్టం చేశారు.

60 సార్లు పోయి వచ్చారు కదా, వారానికి ఒకసారి చార్టర్డ్ ఫ్లుటై వేసుకొని మరి పోయి వచ్చారు కదా, ఇవాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా, ఎవరి అబ్బ సొమ్ము ఇదంతా? ప్రజల సొత్తు కాదా? తెల ంగాణ ప్రజల సొత్తు కాదా? అని ప్రశ్నించా రు. మీ సోకులలు,విలాసాలకు చేస్తున్న కాలక్షేపాన్ని గమనిస్తున్నారని, ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులని కేటీఆర్ స్పష్టంచేశారు.