12 June, 2026 | 1:54 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉషారాణి

23-02-2026 12:34 AM

అభినందనలు తెలిపిన ప్రధానోపాధ్యాయురాలు నాగమణి

గరిడేపల్లి, ఫిబ్రవరి 22 : విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించటం ఎంతో గర్వకారణమని గడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు ధరావత్ నాగమణి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల మండల స్థాయిలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల్లో గడ్డిపల్లి పాఠశాలకు చెందిన అమ్మనబోయిన ఉషారాణి తన ప్రతిభను చాటుకుందన్నారు.

గడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అమ్మనబోయిన ఉషారాణి సీఎం కప్ బాలికల విభాగంలో కబడ్డీ క్రీడలో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆమె తెలిపారు. పెన్ పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన అమ్మనబోయిన నాగరాజు, వీర కుమారి దంపతుల కుమార్తె అమ్మనబోయిన ఉషారాణి పాఠశాలలో పదో తరగతి చదువుతుందని, సీఎం కప్పు  కబడ్డీ క్రీడలను గత నెల 22న గ్రామస్థాయి, 28న మండల స్థాయి, ఈనెల 6న డివిజన్ స్థాయి, 17న జిల్లాస్థాయిల్లో ఆయా పాఠశాలల, మండలాల, డివిజన్లో కబడ్డీ క్రీడలను నిర్వహించారని తెలిపారు.

జిల్లా క్రీడలను సూర్యపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహించారు. అంచలంచలుగా ప్రతి చోట ప్రతిభ కనబరిచిన ఉషారాణి రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు ఈ నెల 20న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయిలో కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై గడ్డిపల్లి పాఠశాలకు, తన స్వగ్రామం దుహపాడుకు గుర్తింపు తెచ్చిందని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉష రాణిని అభినందించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపరిచిన ఉషారాణి మున్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కలగాలని వారు కోరారు.