calender_icon.png 1 June, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ మహిళల్లో యూటీఐ సమస్యలు

30-05-2025 12:00:00 AM

అధిక వేడే కారణం: ఏఐఎన్‌యూ వైద్యురాలు సారికా పాండ్యా

హైదరాబాద్, మే 29: హైదరాబాద్ మ హానగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో.. మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (యూటీఐ) పెరుగుతున్నాయని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)కు చెంది న యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా తెలిపారు. విపరీతమైన వేడి, డీహైడ్రేషన్, జీ వనశైలి అలవాట్ల నేపథ్యంలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచు సంభవిస్తున్నవారు ఆరోగ్యాన్ని ఆయా సీజన్లలో జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

గురువారం ఆమె మాట్లాడు తూ.. వేసవి కాలంలో మహిళల్లో యూటీఐ కేసులు బాగా ఎక్కువవుతున్నాయని, తమ ఆస్పత్రికి వస్తున్న ప్రతీ 10 మంది మహిళల్లో ముగ్గురు యూటీఐ బారిన పడ్డవారేన న్నారు.  శారీరకంగా చూసినప్పుడు మహిళలకు మూత్రనాళం చిన్నగా ఉండడంతో వా రికి యూటీఐ వచ్చే అవకాశం ఎక్కువ అని,  వేసవిలో డీహైడ్రేషన్‌తో పాటు తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల మూత్రం బాగా చిక్కగా అవుతుందన్నారు.

ఇది ఒకరకమైన తేమ వాతావరణాన్ని సృష్టించి, బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతుందన్నారు. బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల యూటీఐ లాంటి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయన్నారు. యూటీఐ లక్షణాల్లో మూత్రవిసర్జన సమయంలో మంటపుట్ట డం, తరుచు మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రం దుర్వాసన రావడం, పొత్తికడుపులో అసౌకర్యం, నీరసం లాంటివి ఉంటాయన్నారు.

ఈ లక్షణాలు ఏమైనా ఒక రోజు కంటే ఎక్కువ ఉంటే సొంత మందులు వాడకుండా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని సూచించారు. ముందస్తు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్లు వస్తాయన్నారు. యూటీఐని నివారించడానికి సులభమైన మార్గం.. నీళ్లు తాగ డమేనని డాక్టర్ పాండ్యా చెప్పారు.

తీపి పా నీయాలు, కెఫిన్ వాడకూడదన్నారు. తరుచు ఇన్ఫెక్షన్లు వచ్చే మహిళలకు తక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్, మెనోపాజ్ దశ దాటిన మహిళలకు వ్జునల్ ఈస్ట్రోజన్ ఇస్తామని, అలాగే తగిన సమయానికి మూత్రవిసర్జన చేయడం చాలా ముఖ్యమని డాక్టర్ సారికా తెలిపారు.