20 August, 2026 | 3:18 AM

మూగజీవాలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పక వేయించాలి

20-08-2026 12:39 AM

మండల పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఆగస్టు19: మూగజీవాలైన గొర్రెలు,మేకలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పక వేయించాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ అంతటి అనిల్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని కోమటిపల్లి గ్రామంలో 1800 మేకలు ,గొర్రెలకు నీలి నాలుక టీకాలను వేసి,మూగజీవాలకు సంవత్సరం పొడుగునా వచ్చే వ్యాధుల గురించి,వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పెంపకం దారులకు అవగాహన కల్పించారు.

అనంతరం జెన్ టెక్స్ కంపెనీ వారి బలవర్ధక,మినరల్స్ తో కూడిన ప్యాకెట్లను సర్పంచ్ నున్న యాదగిరితో కలిసి పెంపకం దారులకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి,ఉపసర్పంచ్ గోవర్ధన్,పెంపకందారులు నున్న లింగయ్య, యాదగిరి, వెంకన్న, మాండ్ర విజయ్,తొడుసు గోవర్ధన్,నున్న సాలయ్య,వీఎల్‌ఓ పద్మ, ఎల్‌ఎస్‌ఏ లతీఫ్,గోపాలమిత్రలు అల్దాసు లింగయ్య గౌడ్,సురేందర్, అర్జున్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.