15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో వాగ్దేవి ప్రభంజనం

03-06-2025 12:11 AM

మహబూబ్‌నగర్, జూన్ 2 (విజయక్రాంతి) : పరీక్ష ఏదైనా ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తుంది. జిల్లా కేంద్రంలోని  వాగ్దేవి కళాశాల తమకు సాటి మరి ఎవరన్నా రీతిలో అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలలో దేశంలోని ప్రతిష్టాత్మకమైన 23 ఐఐటీల్లో బీటెక్,బిఎస్ కోర్సులలో ప్రవేశాల కోసం మే 18 వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలలో ఉన్నత ఫలితాలను సాధించింది.

వాగ్దేవి జూనియర్ కళాశాల చెందిన విద్యార్థిని అశ్విని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి 2610 ర్యాంక్ సాధించినదని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితం రాబట్టడం చాలా ఆ నందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అధ్యాపక బృందం ఎనలేని సేవలు చేస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికీ తీసుకుపోయేలా ముందుకు సాగడం చాలా సంతోషంగా ఉందని తె లిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటి అకాడమీ ఇన్చార్జ్ పావని రెడ్డి, అధ్యాపకులు యాకూబ్, గో విందరాజులు, సందీప్, మహేష్ గౌడ్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.