24 May, 2026 | 4:24 AM

వైభవోపేతం.. కోటి దీపోత్సవం

11-11-2024 12:00 AM

భారీగా తరలివచ్చిన భక్తులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10(విజయక్రాంతి): నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం రెండోరోజూ వైభవంగా కొనసాగింది. ఆదివారం పూజలు చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నర్మదా బాణలింగానికి కోటి భస్మార్చన నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కల్యాణం, నందీవాహనంపై పార్వతీపరమేశ్వరుల వైభవాన్ని భక్తులు తరించుకున్నారు. ముఖ్య అతిథులుగా జస్టిస్ అభినంద్‌కుమార్ షావళి, వీహెచ్‌పీ అధ్యక్షులు అలోక్ కుమార్ పాల్గొని పూజలు నిర్వహించారు.