2 September, 2026 | 9:53 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

పేరు మార్పు నిర్ణయం పట్ల.. నిరసనకు తరలివెళ్లిన వైరా ఆర్యవైశ్యులు

18-03-2025 | 07:43pm

వైరా (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న పేరుని మార్చాలని తీసుకునే నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పేరు మార్చే నిర్ణయం తీసుకోవడం పట్ల ఖమ్మం జిల్లా ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం పొట్టి శ్రీరాములు రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి చందర్రావుతో పాటు వైరా నుండి ఆర్యవైశ్యుల సంఘం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

మాజీ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు వనమా విశ్వేశ్వరరావు ఆర్యవైశ్య మహాసభ జిల్లా సెక్రెటరీ వనమా కిరణ్ కుమార్ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాసరావు, వైరా కోదండ రామాలయం మాజీ చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు, వజినేపల్లి చక్రవర్తి, నూకల ప్రసాద్ రావు, వైరా మండల పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్ ధారా వెంకటకృష్ణ సముద్రాల మురళీకృష్ణ జల్లా అవినాష్ లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.