calender_icon.png 23 February, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైశ్యరాజు జ్యూవెల్లర్స్ కొత్త షోరూం

23-02-2026 01:48:43 AM

దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన సినీనటి అనుపమ

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): దిల్కుష్ ఆభరణాలు, ఆహ్లాదకర ఆఫర్లతో దిల్‌సుఖ్‌నగర్‌లో మెయిన్ రోడ్డులో వైశ్యరాజు జ్యూవెల్లర్స్ నూతన షోరూం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీనటి అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి కొనుగోలును జామి భోజరాజు చేసి శుభారంభం చేశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ఇది మా రెండవ బ్రాంచ్. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే అద్భుతమైన డిజైన్లు, విస్తృత శ్రేణుల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ప్రారంభోత్సవ ఆఫర్‌గా అన్ని రకాల 22కేటీ బంగారు ఆభరణాలుపై ప్లాట్ 6% తరుగుకే పొందవచ్చు. వీవీఎస్ నాణ్యత, ఈఎఫ్ కలర్, ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్ క్యారెట్స్ రూ.49,500 నుండి ప్రారంభం. సాదారణ వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరి లేదు, జీఎస్టీని కూడా మీ తరఫున మేమే చెల్లిస్తాము. అదనంగా కేజి వెండి వస్తువుల కొనుగోలుపై కేజికి రూ.15 వేల తగ్గింపు. ఈ ఆఫర్ కొన్ని రోజు లు మాత్రమే’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణ రాజు, డైరెక్టర్లు వైశ్యరాజు నరేష్ రాజు, వైశ్యరాజు కిరణ్‌కుమార్ రాజు పాల్గొన్నారు.