calender_icon.png 23 February, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు సన్నిహితంగా అక్రమ్‌అలీ!

23-02-2026 01:43:17 AM

దీనిపై దృష్టి సారించాలని డీజీపీకి లేఖ రాసిన మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి వర్గంలో క్రిమినల్ కేసులకు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొన్న వ్యక్తి అక్రమ్ అలీ మొహ్మద్ సన్నిహితంగా మెలుగుతున్నారని బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. సీఎం భద్రతా దృష్ట్యా ఇది ఆందోళన కలిగించే అంశంగా కూడా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఇంత అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండటం, అధికారిక కాన్వాయ్‌లు, ఉన్నత స్థాయి సమావేశాల్లో కనిపిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

జాతీయ భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడినందుకు రాష్ట్ర నిఘా సంస్థలతో గుర్తించబడిన వ్యక్తికి సీఎంకు దగ్గరగా సంప్రదించడాని కి అనుమతినిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఫహీం ఖురేషికి కూడా ఆయన సన్నిహితుడని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఆయనకి పరిచయం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఫహీమ్ ఖురేషీపైన కూడా కేసులున్నాయని, వీటితోపాటు మరికొన్ని వివరాలను ఆయన లేఖలో వెల్లడిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.