17 August, 2026 | 3:59 AM

వాజ్‌పేయి వర్ధంతి వేడుకలు

17-08-2026 12:00 AM

ఆదిలాబాద్, ఆగస్టు 16 : భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని ఆది వారం ఆదిలాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంఎల్‌ఏ పాయల్ శంకర్, జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ లు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సేవకు అంకితమైన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు.

తన రాజకీయ జీవితంలో విలువలు, ప్రజాసేవ, జాతీయ సమైక్యతకు ప్రాధాన్యతనిస్తూ దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. వాజ్పేయి ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటస్వామి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జాదవ్ సుమన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బేర దేవన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కాళ్ల సాయి, కౌన్సిలర్లు జోగు రవి, బండారి పోషన్న, రైల్వే బోర్డు మెంబర్ గణేష్ పాటిల్, మాజీ ఎంపీపీ నగర్గోజె భరత్, రాష్ట్ర నాయకులు మురిధర్ ఠాక్రే, మహిళా నాయకులు నివేదిత, దివ్య, నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

మంచిర్యాల..

మంచిర్యాల టౌన్, ఆగస్టు 16 : భారత రత్నా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి వేడుకలను ఆది వారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ నాయకులు వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాజ్పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.