calender_icon.png 21 July, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండ టౌన్ 41వ వార్డులో వనమహోత్సవం

19-07-2025 01:18:11 AM

  1. పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ముసక్ అహ్మద్, మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్
  2. ధన్యవాదాలు తెలిపిన మాజీ కౌన్సిలర్ వేణుగోపాల్‌రెడ్డి

నల్లగొండ, జూలై 18 (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలోని 41వ వార్డు పద్మావతి కాలనీలో వనమహోత్సవం కార్యక్ర మంలో భాగంగా శుక్రవారం మొక్కలు నాటా రు. మున్సిపల్ కమిషనర్ ముసక్ అహ్మ ద్, మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.

హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేతి రఘుపతి, ఆంజనేయులు, కాలనీ పెద్దలు, మహిళలు కమిటీ సభ్యులు పాల్గొని చెట్లు నాటారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న వార్డు ప్రజలకు, కాలనీ పెద్దలకు మాజీ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.