19-07-2025 01:16:51 AM
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): గురుకులాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. గురుకులాల్లో ఏ ఘటన జరిగినా అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. 327 బీసీ గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఆర్సీవోలు, గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్‌తో పాటు ఇతర అధికారులతో శుక్రవారం మంత్రి పొన్నం జూమ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆర్సీవోలు విధిగా గురుకులాలు తనిఖీలు చేయాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు, టీచర్లు పిల్లలపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పా రు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీపడద్దని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో శుభ్రత పాటించాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.