calender_icon.png 21 July, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి

19-07-2025 01:19:10 AM

 మంత్రి సీతక్క

చిట్యాల,జూలై18(విజయ క్రాంతి): మహిళలు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదాన ఆవరణలో గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ఫ్,స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధ్యక్షతన జరిగిన  ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళల ఆర్థికా భివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం  జరుగుతుందని తెలిపారు. అమ్మ చేతి వంటకు కేరాఫ్ అడ్రస్ ఇందిర మహిళా శక్తి అని,అందుకే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. గోదాంలు, మిల్లులు, పెట్రోల్ బంకులు, కోళ్ల ఫామ్ లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సోలార్ విద్యుత్తు, ఆర్టీసీ బస్సులు ఇలా అనేక  రకాల వ్యాపార సదుపాయాలు మహిళా సంఘాలకు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కోట్ల రుణాలు ఇచ్చామని, క్రమశిక్షణతో చెల్లింపులు తిరిగి చేశారని అలాంటి సంఘాల కు వడ్డీ మాఫీ చేసి తిరిగి చెల్లిస్తున్నామని తెలిపారు.పేదరిక నిర్మూలన జరగాలని, మహిళలు సంతోషంగా ఉండాలని,మహిళ సంతోషంగా ఉంటేనే వారి కుటుంబాలు  క్షేమంగా ఉంటాయన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ నియోజక వర్గంలో 6 బస్సులు ఆర్టీసీకి మహిళా సంఘాల ద్వారా మంజూరు చేసామని ప్రతి నెలా ఒక్కో బస్సుకు 70 వేల రూపాయలు ఆర్టీసీ చెల్లిస్తున్నట్లు తెలిపారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటుతో పాఠశాలల్లో సౌకర్యాలు కల్పన పనులు, విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టు మిషన్ పనులు,6 ఇందిరా మహిళా శక్తి క్యాన్టీలు, మొబైల్ చేపల విక్రయ వాహనం, చెల్పూర్  లో మిల్లెట్ యూనిట్ వంటి మహిళా సాధికారతకు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,సెర్ఫ్ డైరెక్టర్ రజని, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, మండల ప్రత్యేక అధికారి వాలియా నాయక్, ఆర్డిఓ రవి,మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి,తహసీల్దార్ ఇమామ్ పాషా, ఎంపీడీవో జయశ్రీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ రేషన్ కార్డుల మంజూరు.

ములుగు, జూలై18(విజయక్రాంతి): లంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుం బానికి రేషన్ కార్డు అందించాలన్న ఉద్దేశ ంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,ప్రతి నిరుపేద వ్యక్తి రేషన్ కార్డు పొందే హక్కు ఉందని  మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

శుక్రవారం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామ పంచాయతీలో  రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి,గామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్.మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి రేషన్ కార్డు పత్రాలను లబ్ధిదారులకు అందచేశారు.  జిల్లాలో 222 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జిల్లా యంత్రాంగం పూర్తి చేసిందని సంబంధిత అధికారులను అభినందించారు. సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయడంతో కడుపునిండా తిండి తిని కంటి నిండా నిద్రపోతున్నారని హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యా ర్థులకు మౌలిక వసతులు కల్పించి వారి భవిష్యత్కు తోడ్పాటు అందించాలని, విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని  మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లు, సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల మీద నమ్మకం కలిగి ఈ 2025-26 విద్యా సంవత్సరం వసతి గృహాల్లో చదివే విద్యార్థులశాతం పెరిగిందన్నారు.విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలగకూడదని,పాఠశాలలో పరిశుభ్రత, పారిశుద్య ప్రమాణాలు పాటించాలని  స్పష్టం చేశారు.